jasprit bumrah: ఇంగ్లాండ్‌తో సెకండ్ టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాంగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న హెడింగ్లీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత్‌ జట్టుకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా ఆడబోతున్నాడు.

ఇదే విషయాన్ని భారత్ అసిస్టెంట్ కోచ్ డోస్‌చేట్ వెల్లడించారు. పనిభారం కారణంగా బుమ్రాకు రెండో టెస్ట్‌లో రెస్ట్ ఇవ్వాలని అంతా భావించామని.. కానీ ఫస్ట్ టెస్ట్‌ మ్యాచ్ ఓటమి కారణంగా బుమ్రాను ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా ఆడనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

ఇందులో భాగంగా డోస్‌చేట్ మీడియాతో మాట్లాడుతూ.. బుమ్రా రెండో టెస్ట్ మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు. బుమ్రా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని వెల్లడించారు. బుమ్రా ప్లేయింగ్ 11లో ఆడాలని భావిస్తే.. దీనిపై చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చాడు. బుమ్రా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు అని తెలిపాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ రికార్డు ఎలా ఉందంటే?

ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ రికార్డు చూసుకుంటే అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ పిచ్‌లో భారత్ ఇప్పటి వరకు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ గెలవలేకపోయింది. ఈ పిచ్ లో టిమిండియా ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో 7 మ్యాచ్‌లలో జట్టు ఓటమిని చవిచూసింది. 1986లో చివరి టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం