IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు భారత ప్లేయింగ్ 11లో భాగం కావడం లేదని సమాచారం. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో అద్భుతమైన ఫామ్ కనిబరిచిన ఏకైక బౌలర్ బుమ్రా. మొదటి ఇన్నింగ్స్‌లో అతడు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక సెకండ్ టెస్ట్‌లో బుమ్రా ఆడకపోతే జట్టు యాజమాన్యం ఏ ఫాస్ట్ బౌలర్‌ను తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.
బుమ్రాకు విశ్రాంతి
ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు టీం ఇండియా ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడని తెలిసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న టెస్ట్‌లో బుమ్రా ప్లేయింగ్ 11లో భాగం కావడం లేదని తెలిసింది. పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టెస్ట్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే జస్సీ మూడవ టెస్ట్‌లో ఆడనున్నట్లు క్రికెట్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్ట్‌లో బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఒక్క వికెట్ కూడా పడలేదు.
బుమ్రా స్థానంలో ఎవరు?
జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్ట్ మ్యాచ్ కు దూరమైతే, అతని స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. జట్టు యాజమాన్యం అర్ష్ దీప్ సింగ్ లేదా ఆకాష్ దీప్ ను బుమ్రా స్థానంలో తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అర్ష్ దీప్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అదే సమయంలో, ఆకాష్ కు 7 టెస్ట్ మ్యాచ్ ల అనుభవం ఉంది. ఆకాష్ దీప్ 12 ఇన్నింగ్స్ లలో మొత్తం 15 వికెట్లు పడగొట్టాడు. అయితే అర్ష్ దీప్ ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడాడు. అక్కడ అతని ప్రదర్శన బలంగా ఉంది. అందువల్ల ఇప్పుడు వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.






