జూన్‌లో మరో కొత్త వారం వచ్చేసింది. దీంతో ఈ వీక్ చిత్రాలు, సిరీస్‌ల లిస్ట్ గురించి ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వారు ఎదురుచూసినట్లుగానే ఈ వారం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అందులో టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం కూడా ఉంది. అదే కన్నప్ప. ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కన్నప్ప
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం జూన్ 27 రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మార్గన్: ది డెవిల్
కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ మరొక కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మార్గన్: ది డెవిల్’. లియో జాన్ పాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇది కూడా జూన్ 27న రిలీజ్ కానుంది.
మా
బాలీవుడ్ నటి కాజోల్ నటిస్తున్న ‘మా’ చిత్రం కూడా జూన్ 27న రిలీజ్ కానుంది. ఇది హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జియో హాట్‌స్టార్
తు దడ్కన్ మేదిల్ (హిందీ మూవీ) జూన్ 23
ది గిల్డెడ్ ఏజ్ (సీజన్3) జూన్ 23
ఐరన్‌హార్ట్ (మూవీ) జూన్ 25
స్మార్ట్ ఆఫ్ బ్యూటీ(సిరీస్) జూన్ 26
దిబేర్ (సీజన్4) జూన్ 26
మిస్టరీ(సిరీస్) జూన్ 27
ది బ్రూటలిస్ట్ (మూవీ) జూన్ 28
నెట్‌ఫ్లిక్స్
పింటుపింటు సుర్గా (మూవీ) ఇంగ్లీష్ జూన్ 26
రైడ్ 2 (హిందీ మూవీ) – జూన్ 27
స్క్విడ్ గేమ్: ఫైనల్‌సీజన్ (వెబ్ సిరీస్) జూన్ 27
దిగ్రేట్ ఇండియన్ కపిల్ షో (రియాల్టీ షో) జూన్ 28
జీ5
విరాటపాలెం: పీసీమీనా రిపోర్టింగ్ (తెలుగుసిరీస్) జూన్ 27
బిబిషన్ (బెంగాలీ సిరీస్) జూన్ 27
అమెజాన్ ప్రైమ్
పంచాయత్4 (హిందీ సిరీస్) జూన్ 24






