దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే టాలీవుడ్‌లో ఓ క్రేజ్. ఆయన సినిమా వస్తుందంటే యూత్ అంతా ఈగర్ వెయిట్ చేసేవారు. ఫీల్ గుడ్ ఫిలిమ్స్‌కు పెట్టిందిపేరు శేఖర్ కమ్ముల. ఒకప్పుడు ఆనంద్, గోదావరి నుంచి మొదలు పెడితే హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలతో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయన తన కెరీర్‌లో చేసినవన్నీ ఫ్యామిలీ అండ్ ప్రేమ కథ చిత్రాలే.
అలాంటి డైరెక్టర్ తొలిసారి డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీసాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునతో కలిసి ‘కుబేర’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఇవాళ అంటే జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సేల్ చేసేశారు.
దాని ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సుమారు రూ. 47 కోట్లకు ఈ మూవీ రైట్స్ ను కొనుక్కున్నట్లు తెలిసింది. దీంతో ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్‌కు రానుంది. థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని సమాచారం.
ఈ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బెస్ట్ గా నిలిచింది. ఇందులోని పాటలు పర్ఫెక్ట్ ప్లేస్మెంట్‌లో వచ్చాయని సినీ ప్రియులు అంటున్నారు. పాటల కంటే మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని చెప్పుకొస్తున్నారు.






