Mahavatar Narsimha Trailer: హోంబలే ఫిల్మ్స్‌ నుంచి కొత్త సినిమా.. ‘మహావతార్‌ నరసింహ’ ట్రైలర్‌ అదుర్స్

‘కేజీయఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, తొలిసారిగా యానిమేషన్ చిత్ర రంగంలోకి అడుగుపెడుతూ “మహావతార్ నరసింహ” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ బుధవారం (జులై 9) విడుదలైంది.

ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, విజువల్ వండర్ గా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి వరం కోసం చేసే ఘోర తపస్సుతో మొదలైన ఈ ట్రైలర్, భగవాన్ విష్ణువుపై ప్రహ్లాదుడి అచంచలమైన భక్తి, హిరణ్యకశిపుడికి, ప్రహ్లాదుడికి మధ్య జరిగే సంఘర్షణ, చివరకు భక్త ప్రహ్లాదుడిని రక్షించడానికి మహావతార్ నరసింహ ఉగ్రరూపంతో ప్రత్యక్షమయ్యే సన్నివేశాలతో గూస్ బంప్స్ తెప్పించింది.

అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, శక్తివంతమైన నేపథ్య సంగీతం ఈ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచాయి. దర్శకుడు అశ్విన్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రం భారతీయ పురాణ చరిత్రలోని నరసింహావతార కథను అత్యంత అద్భుతంగా, కొత్త తరానికి పరిచయం చేసే విధంగా తెరకెక్కినట్లు ట్రైలర్ తో స్పష్టమైంది.

“మహావతార్ నరసింహ” 3D ఫార్మాట్ లో జూలై 25, 2025న ఐదు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం “మహావతార్ సినిమాటిక్ యూనివర్స్”లో భాగంగా విష్ణువు దశావతారాలను తెరపైకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందుతున్న తొలి ప్రాజెక్ట్ కావడంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం