manchu manoj kannappa review: అన్న విష్ణు ‘కన్నప్ప’ సినిమాపై మంచు మనోజ్ షాకింగ్ రివ్యూ

మంచు విష్ణు, మంచు మనోజ్ అన్నదమ్ముల మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన ఇష్యూల్లో మంచు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాకి మంచు మనోజ్ రివ్యూ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా చూసిన మంచు మనోజ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. తాను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు బాగుందని.. నటన కూడా అద్భుతమని చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కన్నప్ప బాగుంది

మంచు మనోజ్ ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కన్నప్ప చిత్రం చూసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. తాను 5 నిమిషాలు లేట్ గా థియేటర్ లోకి వెళ్లానని తెలిపాడు. అయితే ఆ 5 నిమిషాల కోసం రేపు మరోసారి కన్నప్ప చిత్రం చూస్తానని అన్నాడు. ఈ సినిమా చాలా బాగుందని తెలిపాడు. ప్రభాస్ ఎంట్రీ నుంచి సినిమా రేంజ్ మరింత పెరిగిందని చెప్పుకొచ్చాడు. అన్న మంచు విష్ణు, తండ్రి మోహన్ బాబు పేర్లు నోటి వెంట రాకపోయినా.. పరోక్షంగా వాళ్ల యాక్టింగ్ ను ప్రశంసించాడు.

కన్నప్ప సినిమా చూశానని.. చాలా బాగుందని అన్నాడు. ప్రతి ఒక్కరూ లీడ్ క్యారెక్టర్స్ క్లైమ్యాక్స్‌లో గొప్ప పర్ఫార్మెన్స్ చేశారని.. ఇలాంటి నటన కలలో కూడా తాను ఊహించలేదని తెలిపాడు. అందరూ చాలా చాలా అద్భుతంగా చేశారని చెప్పుకొచ్చాడు. తాను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు గొప్పగా ఉందని తెలిపాడు.

కన్నప్ప మూవీ క్యాస్టింగ్

ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్స్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని స్వయంగా మోహన్ బాబు నిర్మించాడు. చూడాలి మరి పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ చిత్రం ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం