kannappa collections: ‘కన్నప్ప’ 2 డేస్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మొదటి షో నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్స్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని స్వయంగా మోహన్ బాబు నిర్మించాడు.

ఇప్పుడు ఈ మూవీ కలెక్షన్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా రిలీజ్ అయి రెండు రోజులు అయింది. ఈ రెండు రోజుల్లో కన్నప్ప మూవీ కలెక్షన్స్ అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.15.29 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది.

మొదటి రోజు రూ.13 కోట్లు రాబట్టింది. అందులో రూ .9.35 కోట్ల నెట్, రూ .11 కోట్ల గ్రాస్ ఉండగా.. ఓవర్సీస్ లో రూ.2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు శనివారం అయినప్పటికీ కలెక్షన్లు డీలా పడ్డాయి. ఇండియాలో రెండో రోజు రూ .5.94 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.15.29 కోట్లు సాధించింది. చూడాలి మరి త్వరలో ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలో తెలిపారు. కానీ అని వార్య కారణాలవల్ల వాయిదా పడింది. అందిన సమాచారం ప్రకారం.. వి ఎఫ్ ఎక్స్ కారణాలవల్లే ఈ మూవీ వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గతంలో మంచు విష్ణు ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

ఏప్రిల్ 25న రిలీజ్ కావలసిన కన్నప్ప సినిమా వాయిదా పడిందని తెలిపారు. కానీ అప్పుడు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత దీనిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అనుకున్న తేదీకి రిలీజ్ చేశారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం