honeymoon murder case: హనీమూన్ మర్డర్ కేసు.. రాజా రఘువంశీని చంపింది ఈ కత్తితోనే!

MPలోని ఇండోర్‌‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనీమూన్ పేరుతో అతడి భార్య సోనమ్.. సుపారి ఇచ్చి మరీ రాజా రఘువంశీని హత్య చేయించడంతో ఈ వార్త మరింత సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరొక విషయం బయటకొచ్చింది.

రాజా రఘువంశీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒక పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధంతోనే రాజాపై దాడి చేసి చంపారని తేలింది. ఈ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు దానిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈ పదునైన ఆయుధాన్ని స్థానిక భాషలో ‘దావో’ అని పిలుస్తారు. అదే సమయంలో రాజాను హత్య చేస్తున్నప్పుడు నిందితుడు ఆకాష్ దుస్తులపై రక్తం మరకలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో హత్య సమయంలో సోనమ్ కూడా ఉన్నారని కూడా స్పష్టమైంది. కాగా ఈ హత్య కేసులో రాజ్ సింగ్ కుష్వాహాతో సహా 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసు ఏంటి?

రాజ రఘవంశీ, సోనమ్ మే 10న మ్యారేజ్ చేసుకున్నారు. అదే నెలలో హనీమూన్​కోసం మధ్యప్రదేశ్​నుంచి మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి ఈ జంట మిస్సింగ్ అయింది. దీంతో ఈ కొత్త జంట కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలెట్టారు. కొద్ది రోజులు తర్వాత జూన్ 2న రాజా రఘవంశీ మృతదేహం లభ్యమైంది.
చిరాపుంజికి సమీపంలోని ఒక లోయలో రాజా డెడ్ బాడీ దొరికింది. మృతుడి భార్య సోనమ్ మాత్రం కనిపించకుండా పోయింది. ఆ సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని అంతా భావించారు. కానీ అసలు విషయం బయటపడటంతో అంతా షాక్ అయ్యారు.

పోలీసులు మరింత వేగంగా దర్యాప్తు చేయగా ముగ్గురు కిల్లర్లు దొరికారు. వారిని విచారించగా అసలు నిజం బయటపడింది. రాజ రఘవంశీ భార్య సోనమ్ తన భర్తను హత్య చేయాలని చెప్పిందని కిల్లర్లు పోలీసులకు తెలిపారు. దీనికోసం ఆమె తమకు రూ.20 లక్షలు ఇస్తామని చెప్పిందని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేశారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం