వర్షాకాలంలో నీటి కలుషితం ద్వారా వచ్చే వ్యాధుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో నీరు, ఆహారం చాలా సులభంగా కలుషితమవుతాయి. అందువల్ల అది ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. అందుకే ఈ సీజన్‌లో విరేచనాలు లేదా కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో ఈ సీజన్‌లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో విరేచనాలు లేదా కలరా వంటి వ్యాధులకు ప్రధాన కారణం మురికి అని వైద్యులు అంటున్నారు. ఈ సీజన్‌లో పరిశుభ్రతపై సరైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ సమస్యలను ఎలా నివారించాలో తెలుసుకుందాం.
చేతులు బాగా కడుక్కోవాలి
వ్యాధులను నివారించడానికి చేతులను సరిగ్గా కడుక్కోవాలి. తినడానికి ముందు కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో చేతులను కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడం ద్వారా విరేచనాలకు కారణమయ్యే అన్ని క్రిములు చనిపోతాయి.
శుభ్రమైన నీరు తాగాలి
వర్షాకాలంలో విరేచనాలు, కలరా రావడానికి నీరు ప్రధాన కారణాలలో ఒకటి. కలుషితమైన నీరు త్వరగా అనారోగ్యానికి గురి చేస్తుంది. అటువంటి పరిస్థితిల నీరు త్రాగేటప్పుడు అది పూర్తిగా శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి. వీలైతే మరిగించిన నీటిని తాగాలి.
పండ్లు, కూరగాయలు శుభ్రం
పండ్లు, కూరగాయలను వండుకుని తినడానికి ముందు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. అలాగే కోసిన పండ్లు లేదా కూరగాయలను ఎక్కువసేపు బయట ఉంచవద్దు.
తాజా ఆహారం
ఈ సీజన్ లో తాజా ఆహారాన్ని తినాలి. ఆహారం చల్లగా ఉంటే, తినడానికి ముందు వేడి చేయండి. ఆహారాన్ని బయట ఉంచాల్సి వస్తే, దానిని మూతపెట్టండి.
బయటి ఆహారం వద్దు
బయట ఆహారం అమ్మే చాలా మంది పరిశుభ్రతపై పెద్దగా శ్రద్ధ చూపరు. ఈ కారణంగా ఆ సీజన్‌లో బయట తినడం వల్ల విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది.






