వర్షాకాలం వచ్చిందంటే.. వ్యాధులు, ముఖ్యంగా కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల అజీర్ణం, అపానవాయువు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు పెరుగుతాయి. వర్షాకాలంలో కడుపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ఆహారంలో ఏ పదార్థాలు చేర్చుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
జీర్ణక్రియ ఎందుకు నెమ్మదిస్తుంది..
వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా జరగడానికి అనేక కారణాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ సీజన్‌లో బ్యాక్టీరియా ప్రమాదం పెరుగుతుంది. మనం సరైన ఆహారం తీసుకోకపోతే.. అది జీర్ణవ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా పోషకాల శోషణ తగ్గి జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ సీజన్‌లో తేమ పెరగడం వల్ల రక్త ప్రవాహం, జీవక్రియ కూడా ప్రభావితమవుతాయి.
తాజా పరిశోధన
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) ప్రకారం.. ఈ సీజన్‌లో సంభవించే సాధారణ కడుపు సమస్యలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వీటిలో విరేచనాలు, అకస్మాత్తుగా ఆకలి లేకపోవడం వంటివి ఉన్నాయి. ఈ లక్షణాలను గుర్తించడం వల్ల సకాలంలో చికిత్స పొందవచ్చు.
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్
పచ్చి ఆకు కూరలు – పచ్చి ఆకు కూరలు, సలాడ్లు సరిగ్గా కడగకపోతే బ్యాక్టీరియా పెరుగుదుతుంది. కాబట్టి ఈ వస్తువులను సరిగ్గా ఉడికించి, ఆహారంలో పరిమిత పరిమాణంలో చేర్చుకోవడం మంచిది. తినకుండా ఉన్నా పర్లేదు.
స్ట్రీట్ ఫుడ్ – స్ట్రీట్ ఫుడ్స్ తరచుగా జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే వైద్యులు దీనిని తినకూడదని సలహా ఇస్తారు.
సముద్ర ఆహారం – వర్షాకాలంలో సముద్ర ఆహారం వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం కారణంగా అది చెడిపోయే అవకాశాలు పెరుగుతాయి. ఇది కడుపుపై నేరుగా ప్రభావం చూపుతుంది.






