prabhas : ప్రభాస్ గొప్ప మనసు.. ఫిష్ వెంకట్ కిడ్నీ సర్జరీకి రూ.50లక్షల సహాయం

టాలీవుడ్‌లో ఫిష్ వెంకట్‌గా పేరుగాంచిన నటుడు, కమెడియన్ పరిస్థితి ఇప్పుడు అధ్వనంగా మారింది. ప్రస్తుతం అతడు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో హాస్పిటల్‌లోని వెంటిలేటర్ పై ఉన్నారు. ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉంది. అతడు ఐసీయూలో ఉన్నాడు.

దీంతో వెంకట్ కుమార్తె స్రవంతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. డాక్టర్లు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారని.. అయితే దానికి కనీసం రూ. 50 లక్షలు వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ విషయం తెలిసి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకుంటానని తెలిపారని ఆమె చెప్పుకొచ్చారు.

తమకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభాస్ టీమ్ తమను సంప్రదించిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా తన తండ్రితో కలిసి వర్క్ చేసిన ఇతర టాలీవుడ్ నటీనటుల నుంచి కూడా సహాయాన్ని ఆమె అభ్యర్థించారు.

ఆమె మీడియాతో ఏం మాట్లాడారు?

నాన్న ఆరోగ్యం అస్సలు బాలేదని.. ఆయన సీరియస్‌గా ఉన్నారనని తెలిపారు. ప్రస్తుతం నాన్న ఐసీయూలో చికిత్స పొందుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు. నాన్నకు ఇప్పుడు కిడ్నీ మార్పిడి అవసరం ఉందని.. దీని కోసం కనీసం రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుందని డాక్టర్లు చెప్పారని తెలిపింది. ఈ విషయం తెలిసి హీరో ప్రభాస్ పీఆర్ టీమ్ నుండి తమకు ఫోన్ వచ్చిందని.. వారు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారని ఆమె తెలిపారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం