పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న కొత్త చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా లేట్ అయింది. ఇదే విషయాన్ని రీసెంట్ గా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్, ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ టీజర్ కు వచ్చిన స్పందనను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ క్రేజీగా యూజ్ చేసుకుంది. మరీ ముఖ్యంగా తెలుగులో రెస్పాన్స్ అదిరిపోయింది.
#HYDTPweBringAwareness
📢ℋℯ𝓁𝓁ℴ… ℋℯ𝓁𝓁ℴ….!
బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.
🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025
ఇందులోని క్యాచీ డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. ‘హలో హలో హలో.. బండి కొంచెం మెల్లగా పోనీ’, ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ అనే డైలాగ్ లు బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ఆ డైలాగ్‌లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఓ వీడియో క్రియేట్ చేశారు. అందులో బండి మెల్లగా నడపాలి, హెల్మెట్ ధరించాలి అనే విషయాలను ప్రభాస్ డైలాగ్ ల వీడియోతో క్రియేట్ చేసిన వీడియో అదిరిపోయింది.
మొదట సాహో సినిమాలోని ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్ తో ప్రారంభమైంది. వెంటనే బైక్ మీద రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాడు. అప్పుడు రాజాసాబ్ లోని ‘హలో హలో బండి కొంచెల మెల్లగా’ డైలాగ్ చెప్పడం కనిపిస్తుంది. ఆ తర్వాత మిర్చి మూవీలో ప్రభాస్ బైక్ మీద స్లోగా వచ్చే సీన్‌ను ఆ వీడియోలో యాడ్ చేశారు. ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ అంటూ రాజాసాబ్ డైలాగ్‌ను పెట్టారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.






