coolie movie mounika song: పూజా హెగ్డే రప్పా రప్పా.. ‘కూలీ’ మూవీ నుంచి మాస్ బీట్ సాంగ్

సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “కూలీ” చిత్రం నుంచి రెండవ సింగిల్ “మోనిక” పాట జూలై 11న సాయంత్రం విడుదలైంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

‘మోనిక’ పాటలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది. రెడ్ కలర్ దుస్తులలో, పూజా హెగ్డే ఒక కార్గో షిప్ సెట్‌పై వందలాది మంది డ్యాన్సర్‌లతో కలిసి ఊరమాస్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆమెతో పాటు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కూడా ఈ పాటలో మెరిశారు. అనిరుధ్ రవిచందర్, సుహాసిని ఈ పాటను ఆలపించగా, ఈ పాటలో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి ప్రస్తావన కూడా ఉంది.

ఈ పాట విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చి, సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. అనిరుధ్ తనదైన స్టైల్‌లో కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ పాట మెదడును ఉత్తేజపరుస్తోంది. “కూలీ” చిత్రం నుంచి గత నెలలో విడుదలైన మొదటి సింగిల్ “చికిటు” సాంగ్ కూడా విశేష స్పందన పొందింది. ఆ పాటలో రజనీకాంత్, టి. రాజేందర్‌లతో కలిసి అనిరుధ్ కనిపించి సందడి చేశారు.

“కూలీ” చిత్రంలో రజనీకాంత్, ఆమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది. ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘మోనిక’ పాట విడుదలవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయం సాధించి, రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం