rinku singh priya saroj: రింకు సింగ్, ప్రియా సరోజ్ మ్యారేజ్ వాయిదా

భారత క్రికెటర్ రింకు సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ని నిశ్చితార్థం చేసుకున్నాడు. జూన్ 8, 2025న లక్నోలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ జంట నిశ్చితార్థ వేడుకకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, నటి జయా బచ్చన్, క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఈ ఏడాది నవంబర్‌ 18న వీరి వివాహం ఫిక్స్ చేసుకున్నారు. అయితే నవంబర్‌లో జరగాల్సిన వీరి వివాహ కార్యక్రమం ఇప్పుడు వాయిదా పడిందని తెలుస్తోంది.

వివాహం ఆలస్యానికి గల కారణం

రింకు సింగ్, ప్రియా సరోజ్ ల వివాహం నవంబర్ 19, 2025న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. జూన్ 8, 2025న లక్నోలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఫిబ్రవరి 2026లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీ ఇంకా ఖరారు కాలేదు.

అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్‌లో భారత జాతీయ జట్టుతో రింకు సింగ్ క్రికెట్ షెడ్యూల్ కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ జంట మొదట నవంబర్‌లో జరిగే వారి వివాహం కోసం వారణాసిలోని తాజ్ హోటల్‌ను రిజర్వ్ చేసుకున్నారు. అయితే రింకు బిజీ షెడ్యూల్ కారణంగా బుకింగ్ ఫిబ్రవరి 2026 చివరి వరకు మార్చినట్లు తెలుస్తోంది.

నవంబర్‌లో భారత్ దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. రెండవ టెస్ట్ నవంబర్ 22 నుండి గౌహతిలో ప్రారంభమవుతుంది. కానీ రింకు సింగ్ టెస్ట్ జట్టులో భాగం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ రెడ్ బాల్ జట్టులో భాగం కాలేదు. కానీ, ఉత్తరప్రదేశ్‌తో దేశీయ జట్టులో ఆడే ఛాన్స్ ఉంది. ఇది అతని వాయిదాకు కారణం అయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం