shubman gill: కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 5 రికార్డులు

ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ సంచలన ప్రదర్శనతో పలు రికార్డులను తిరగరాశాడు. యువ కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో పరుగులు వరద పారించి, చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ చేసిన పరుగులతో నెలకొల్పిన 5 ముఖ్యమైన రికార్డులు తెలుసుకుందాం.

ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్

శుభమన్ గిల్ రెండో టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో (269 పరుగులు) చేశాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కూడా ఇంగ్లాండ్‌లో ఈ ఘనత సాధించలేదు. ఇది అతని టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ కూడా కావడం విశేషం.

ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడు:

తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అద్భుతమైన సెంచరీ (161 పరుగులు) చేసి చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన రెండో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో సునీల్ గవాస్కర్ 1971లో ఈ ఘనత సాధించారు.

టెస్టుల్లో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడు:

గిల్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు (ఇంగ్లాండ్ గడ్డపై 269 పరుగులు) చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గతంలో సునీల్ గవాస్కర్ (221 పరుగులు, 1979) పేరిట ఉన్న రికార్డును గిల్ అధిగమించాడు.

డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్:

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA దేశాలు) వంటి దేశాల్లో టెస్టు డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభమన్ గిల్ ఘనత సాధించాడు. ఈ రికార్డును సృష్టించడం ద్వారా అతను ఆసియా క్రికెట్ చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు.

ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు

తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో కలిపి ఈ టెస్టులో మొత్తం 430 పరుగులు సాధించిన శుభమన్ గిల్, ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 1971లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై చేసిన 344 పరుగుల రికార్డును 54 ఏళ్ల తర్వాత గిల్ బద్దలు కొట్టడం విశేషం.

గిల్ కెప్టెన్సీలో భారత్ తొలి టెస్టు సిరీస్‌లోనే అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఈ రికార్డులన్నీ అతని అద్భుతమైన ప్రతిభకు, నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు గిల్ ఒక వెలుగు అవుతాడని ఈ ప్రదర్శనతో రుజువు చేశాడు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం