భారత ఆటగాళ్ళు ఇంగ్లాండ్‌లో తరచుగా కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ టోర్నీ జరుగుతోంది. ఇందులో టీం ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. అతడు నాటింగ్‌హామ్‌షైర్‌తో 2 మ్యాచ్‌ల ఒప్పందంపై సంతకం చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఈ కౌంటీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ అద్బుతమైన ప్రదర్శన చేస్తున్నాడు.
రీసెంట్‌గా జరిగిన మొదటి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇషాన్ 87 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో అతడు పాకిస్తాన్‌కు చెందిన ప్లేయర్‌తో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ కూడా కౌంటీ క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతున్నాడు.
అంటే ఒకే మ్యాచ్‌లో భారతదేశం, పాకిస్తాన్‌కు చెందిన ప్లేయర్లు కలిసి ఆడుతుండటంతో హాట్ టాపిక్‌గా మారింది. తొలి మ్యాచ్‌లో మహ్మద్ అబ్బాస్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇషాన్ వికెట్ వెనుక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత అబ్బాస్ పరిగెత్తి ఇషాన్‌ను కౌగిలించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
India 🇮🇳 has boycotted the bilateral talks with Pakistan 🇵🇰
~ But, India can't boycott cricket with Pakistan. In this video, Ishan Kishan is the wicket keeper and the bowler is Abbas Afridi from Pakistan 🧐
~ What's your take on this 🤔 #INDvsENG pic.twitter.com/Hfo2G97PBk
— Richard Kettleborough (@RichKettle07) June 23, 2025
మ్యాచ్ అనంతరం పాకిస్తానీ ఆటగాడు మహ్మద్ అబ్బాస్.. ఇషాన్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నాడు. అవి చాలా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కౌంటీ క్రికెట్‌లో భారతదేశం, పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకే జట్టు తరపున ఆడటం ఇదేం మొదటిసారి కాదు. ఇది వరకు చాలా మంది ఆటగాళ్లు కలిసి ఆడారు.
1970లో కౌంటీ క్రికెట్‌లో భారతదేశానికి చెందిన బిషన్ సింగ్ బేడి, పాకిస్తాన్‌కు చెందిన ముష్తాక్ మొహమ్మద్, సర్ఫరాజ్ నవాజ్ నార్తాంప్టన్‌షైర్ తరపున కలిసి ఆడారు. 2005లో భారతదేశానికి చెందిన జహీర్ ఖాన్, పాకిస్తాన్‌కు చెందిన అజార్ మహమూద్ కలిసి ఆడారు. 2022లో చేతేశ్వర్ పుజారా, మొహమ్మద్ రిజ్వాన్ కౌంటీ క్రికెట్‌లో ఒకే జట్టు తరపున ఆడారు.






