pashamylaram incident: పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇప్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన బ్లాస్ట్ సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన సంబంధించిన అధికారులతో సమీక్షించారు. పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపి.. దానికి సంబంధించిన పూర్తి రిపోర్టును ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వం తరుఫున బాధితులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు ఎన్నడూ జరగలేదని అన్నారు. సిగాచి ప్రమాదం అత్యంత బాధాకర విషయమని.. ఎంతో దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చూస్తానని తెలిపారు.

కంపెనీ వాళ్లతో చర్చిస్తామని.. ఆపై మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం అందించేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే తీవ్రంగా గాయపడి పనిచేయని స్థితిలో ఉన్నవారికి రూ.10 లక్షలు అందేలా చూస్తామన్నారు. ఈ అత్యంత విషద ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారు.

అందువల్ల ఈ ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపించి.. మరోసారి ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో చనిపోయినవారి పిల్లలు, గాయపడిన వారి పిల్లల చదువుల బాధ్యత మొత్తం తమ ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఇది కాకుండా బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం తరపున ఆర్థికంగా తక్షణ సాయం కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.1లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు అందించాలని అధికారులను కోరారు. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు 36 మంది మృతి చెందారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం