thalliki vandanam second phase: మరోసారి ‘తల్లికి వందనం’.. తల్లుల ఖాతాల్లోకి రూ.13వేలు

ఏపీ సర్కార్ ‘తల్లికి వందనం’ స్కీమ్ పై మరో అదరిపోయే అప్డేట్ అందించింది. ఇప్పటికే మొదటి విడతలో 67 లక్షల మందికి డబ్బులు జమ చేసింది. అయితే తొలి విడతలో డబ్బులు రాని వారికి, అలాగే కొత్తగా స్కూల్స్, కాలేజీలో చేరిన వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రెండో విడతగా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారికి సెకండ్ ఫేస్ కింద డబ్బులు వేయనుంది. వీరితో పాటుగా తొలి విడతలో డబ్బులు రాని వారి అకౌంట్ లో కూడా వేయనుంది.

ఇందులో భాగంగా జూలై 10న ‘తల్లికి వందనం’ రెండో విడత డబ్బులను విడుదల చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఆ రోజున తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. అయితే ముందుగా జూలై 5న ఈ డబ్బులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ విద్యార్థుల అడ్మిషన్స్ ఇంకా జరుగుతున్న నేపథ్యంలో ఆ డేట్ను జూలై 10కి పొడిగించారు. దీంతో రెండో విడతలో తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు పడనున్నాయి.

ఏపీ ప్రభుత్వం ఇటీవల సూపర్ సిక్స్‌లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసింది. మొత్తం 67, 27, 164 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఒక్కొక్కరు చొప్పున రూ.13 వేల సాయం అందజేసింది.

అయితే ప్రభుత్వం ముందుగా ఒక్కొక్కరికీ రూ. 15వేలు ఇస్తానని చెప్పింది. కానీ ఇప్పుడు రూ.2వేలు కట్ చేసి రూ.13వేలు మాత్రమే ఇచ్చింది. ఆ కట్ చేసిన డబ్బును పాఠశాలలు/జూనియర్ కళాశాల నిర్వహణ, పరిశుభ్రత/పారిశుధ్యానికి ఉపయోగించనుంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం