turmeric powder vs kachi raw haldi: పసుపు పొడి లేదా పచ్చి పసుపు.. రెండింటిలో ఏది బెస్ట్?

ప్రతి ఒక్కరి ఇళ్లలో లభించే పసుపు కేవలం ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కర్కుమిన్ అధికంగా ఉండే పసుపు దాని శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

సాధారణంగా మన ఇళ్లలో పసుపు పొడిని ఉపయోగిస్తాము. కానీ పచ్చి పసుపు కూడా ఉంటుందని మీకు తెలుసా?. ఇది ఎక్కువగా దేవాలయాలు, శుభ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. కాబట్టి ఈ రెండు పసుపులలో ఏది ఎక్కువగా వాడాలి. ఏ పసుపు ఆరోగ్యకరమైనదో తెలుసుకుందాం.

పోషకాల పరంగా

పచ్చి పసుపును తాజా పసుపు అని కూడా పిలుస్తారు. ఇందులో కర్కుమిన్ శోషణను పెంచే సహజ నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

మరోవైపు పసుపు పొడిలో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. కానీ దానిని తయారు చేయడానికి జరిగే ప్రాసెసింగ్ కారణంగా సహజ నూనెలు, పోషకాలు తగ్గుతాయి.

కర్కుమిన్

పచ్చి పసుపులో కర్కుమిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది బరువు ప్రకారం.. దాదాపు 2-5% ఉంటుంది. అయితే ప్రాసెసింగ్ కారణంగా పసుపు పొడిలో కర్కుమిన్ పరిమాణం 5-8% వరకు ఉంటుంది.

షెల్ఫ్ లైఫ్

పచ్చి పసుపు తక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే 2-3 వారాల పాటు నిల్వ ఉంటుంది. అయితే పసుపు పొడి నిల్వ చేయడం సులభం. నెలల తరబడి ఉంటుంది.

రెండింటిలో ఏది బెస్ట్?

పచ్చి పసుపు ఆరోగ్యకరమైనదని అంటారు. ఎందుకంటే ఇది ఎక్కువ పోషకమైనది, సహజమైనది. పచ్చి పసుపును రసం లేదా టీలో ఉపయోగించవచ్చు. సౌలభ్యం దృష్ట్యా పసుపు పొడి ప్రజలకు మంచిది. అయితే ప్రజలు రెండు రకాల పసుపులను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండూ మంచివే. పసుపు పొడిని వంట కోసం ఉపయోగించవచ్చు.

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వీటి గురించి తెలుసుకునే ముందు వైద్యున్ని సంప్రదించాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం