Vijay Deverakonda: ‘కింగ్డమ్’ అన్నాదమ్ముల మధ్య అనుబంధం.. అదరగొడుతున్న ‘అన్నా అంటేనే’ సాంగ్..

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ సినిమా నుండి రెండవ సింగిల్ “అన్నా అంటేనే” పాట విడుదలైంది. ఈ పాట సోదర బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించి, ఆలపించిన ఈ పాటను కృష్ణకాంత్ రచించారు. “అన్నా అంటేనే” అని సాగే ఈ భావోద్వేగమైన సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ పోషించిన శివ, సూరి పాత్రల మధ్య అనుబంధం హృదయాలను కదిలించేలా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాల్యం నుండి పెద్దయ్యే వరకు వారి మధ్య ప్రేమ, త్యాగం, అవినీతి సమాజానికి వ్యతిరేకంగా పోరాడటం వంటి అంశాలను ఈ పాటలో ప్రస్తావించారు.

ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం