బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరమయ్యారు. అతడు గతంలో నటించిన దంగల్ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా దంగల్ ఉంది. అలాంటి అమీర్ ఖాన్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమా తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
కానీ అప్పుడు అంత జోష్ ఇప్పుడు లేదు. వరుస సినిమాలు తీసి ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్ద, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. అందువల్ల ఈసారి ఎలాగైనా బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకున్నాడు.
2007లో అమీర్ ఖాన్ నటించిన బిగ్గెస్ట్ సూపర్ హిట్ చిత్రం తారే జమీన్ పర్. అప్పట్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా “సితారే జమీన్ పర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అమీర్ ఖాన్ నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అమీర్ ఖాన్ బాస్కెట్బాల్ కోచ్గా కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 3.28 నిమిషాల రన్ టైం తో వచ్చిన ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఆధ్యాంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అమీర్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 20న విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా అమీర్ ఖాన్కు ఎలాంటి కంబ్యాక్ అందిస్తుందో.