Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రిలీజ్ వాయిదా

టాలీవుడ్ మాస్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలను చేస్తున్నాడు. గతంలో లైగర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అంతా భావించారు. కానీ ఆ సినిమా అత్యంత డిజాస్టర్ గా మారింది. దీంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విజయ్ ఆ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో పరవాలేదు అనిపించుకున్నాడు.

అయితే ఈసారి ఎలాగైనా ఒక సూపర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గ కథను ఎంచుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ సినిమా పేరే కింగ్డమ్. టైటిల్కు తగ్గట్టుగా ఇందులో విజయ్ దేవరకొండ లుక్ అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. షార్ట్ హెయిర్, బాడీ పిక్ అప్, రగడ లుక్ తో విజయ్ కనిపించాడు.

ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ టీజర్ లో అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఈ చిత్రo సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. దీనిని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ముందుగా ఈ చిత్రాన్ని ఈనెల అంటే మే 30వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ కుష్ అయ్యారు. మరికొద్ది రోజులే రిలీజ్ కు ఉండడంతో అంతా సినిమా కోసం వెయిట్ చేశారు. కానీ తాజాగా మేకర్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని జూలై 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం