టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల బిగ్ షాక్ ఇచ్చారు. వీరిద్దరూ వారం గ్యాప్ లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఎంతోకాలంగా టీమిండియాకు టెస్ట్ క్రికెట్లో వెలకట్టలేని సేవలు అందించిన ఈ జోడి.. ఇప్పుడు తప్పుకుంది. దీంతో భారత్ టెస్ట్ జట్టులో ఈ ఇద్దరి స్టార్ ప్లేయర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో వారి ప్లేస్‌లను ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
వారి ప్లేస్ లను భర్తీ చేయగలిగిన సత్తా ఎవరికి ఉంది అనే ఉత్కంఠ అందరిలోనూ మెదులుతుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ లిస్టులో చాలామంది ఉన్నారు. రోహిత్, కోహ్లీ ఖాళీ చేసిన స్థానాలను సమర్థవంతంగా పూర్తి చేయగలిగిన సత్తా ఉన్న బ్యాటర్లలో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. అయితే సెలక్టర్లు కాస్త ఎక్స్పీరియన్స్ కలిగిన ఆటగాడిని కోరుకుంటే.. శ్రేయస్ అయ్యర్ కనిపిస్తున్నాడు.
ఐపీఎల్ లో శ్రేయస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఇక టెస్టుల్లోనూ తన ప్రతిభ చూపించాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికే అతడు 14 టెస్టులు ఆడి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మరోవైపు టెక్నిక్ గేమ్ ఆడటం లో సాయి సుదర్శన్ దిట్ట. ఐపీఎల్ లో తానేంటో నిరూపించుకుంటున్నాడు.
గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఓపెనర్ గా మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. అందువల్ల ఇంగ్లాండ్ తో సిరీస్ లో అతడిని తీసుకోవాలని ఇప్పటికే రవి శాస్త్రి సూచించారు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. దొరికిన కొన్ని అవకాశాలను సర్ఫరాజ్ కాన్ బాగా వినియోగించుకున్నాడు. వీరితో పాటు కరుణ్ నాయర్, ఇషాన్ కిషన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు.