విరేచనాలు (లూజ్ మోషన్స్) అనేది సాధారణంగా ఎవరికైనా వచ్చే నార్మల్ సమస్య. పాాడైపోయిన ఫుడ్ తినడం వల్ల లేదా మరేదైన అలవాట్లు దీనికి కారణం అవుతాయి. ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే.. చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. విరేచనాలు అవుతున్న కొద్ది రోజుల్లోనే బలహీనంగా అనిపిస్తుంది. అయితే, అకస్మాత్తుగా లూజ్ మోషన్ సమస్యను ఎదుర్కొంటుంటే.. మెడిషన్స్ తీసుకునే ముందు ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో నయం చేయవచ్చు. ఇంట్లో ఉంచుకున్న కొన్ని వస్తువులను తినడం వల్ల అలాంటి స్థితిలో మీకు చాలా సహాయపడుతుంది.
పసుపు- మీరు లూజ్ మోషన్ సమస్యతో పోరాడుతుంటే పసుపు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు లూజ్ మోషన్ సమస్య ఉంటే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపు బాగా కలిపి, ఆ తర్వాత తాగాలి. మీరు దీన్ని రోజుకు 2-3 సార్లు చేయాలి. పసుపులోని యాంటీబయాటిక్ లక్షణాలు పేగులలోని బ్యాక్టీరియాతో పోరాడి, విరేచనాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
కొబ్బరి నీరు – లూజ్ మోషన్ సమస్యలో కొబ్బరి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లూజ్ మోషన్ నయం కాకపోతే, మీరు రోజుకు రెండుసార్లు కొబ్బరినీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లూజ్ మోషన్ వల్ల కలిగే డీహైడ్రేషన్ నివారిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
జీలకర్ర నీరు – మీరు విరేచనాలతో ఇబ్బంది పడుతుంటే జీలకర్ర నీరు కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు విరేచనాలతో బాధపడుతుంటే ఒక పాన్ లో నీరు, జీలకర్ర వేసి మరిగించండి. తర్వాత అది చల్లబడిన తర్వాత, దానిని వడకట్టి తాగాలి. ఇలా రోజంతా మూడు నుండి నాలుగు సార్లు చేయండి. జీలకర్రలోని క్రిమినాశక లక్షణాలు పేగులోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
అరటిపండు – విరేచనాలు అయినప్పుడు అరటిపండు తినడం చాలా మంచిదని భావిస్తారు. అరటిపండు తినడానికి ఇష్టపడకపోతే, పెరుగులో కలిపి స్మూతీని కూడా తయారు చేసుకోవచ్చు. రోజుకు 2-3 అరటిపండ్లు తినడం లేదా రోజుకు రెండుసార్లు అరటిపండు స్మూతీ తినడం వల్ల లూజ్ మోషన్ నుండి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అరటిపండులో ఉండే పెక్టిన్ పేగులలోని ద్రవాలను గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా విరేచనాలను ఆపుతుంది. అరటిపండులోని పొటాషియం లూజ్ మోషన్ వల్ల శరీరం కోల్పోయిన ద్రవాన్ని భర్తీ చేస్తుంది.