గత కొన్ని సార్లు సోషల్ మీడియాలో సెలెరీ జ్యూస్ ట్రెండ్ బాగా పెరిగింది. సెలెరీలో లభించే విటమిన్లు బరువు తగ్గడానికి, చర్మం, జుట్టుకు పోషణను అందించడానికి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. సెలెరీ జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సెలెరీలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు దాని ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతాయి. కానీ రోజూ దాని రసం తాగేతే కలిగే నష్టాలు, దుష్పభావాలు ఏంటో తెలుసుకుందాం.
అలెర్జీ సంభవించవచ్చు
కొంతమందికి సెలెరీ జ్యూస్ తాగితే అలెర్జీ రావచ్చు. దీని కారణంగా వారు దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తారు. సెలెరీని ఉపయోగించే ముందు ఉడకబెట్టినా అది అనేక రకాల అలెర్జీలకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జీర్ణ సమస్యలు
బలమైన సెలెరీ రసం దుష్ప్రభావాలలో ఒకటి జీర్ణ సమస్యలు. ఇది కొంతమంది వ్యక్తులలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఫలితంగా ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధ్యయనం ప్రకారం.. సెలెరీలో ఉండే స్టార్చ్ కడుపులో కిణ్వ ప్రక్రియకు కారణమవుతుంది. ఉబ్బరం లేదా అసౌకర్యానికి దారితీస్తుంది. ఇప్పటికే సున్నితమైన కడుపు ఉన్నవారికి ఇది మరింత తీవ్రమైనది.
చర్మ సున్నితత్వం పెరగవచ్చు
సెలెరీ రసం దుష్ప్రభావాలలో మరొకటి చర్మ సున్నితత్వం. దీని కారణంగా మీ చర్మం సూర్యరశ్మికి చాలా సున్నితంగా మారుతుంది. దీని కారణంగా కొంతమందికి సులభంగా వడదెబ్బ తగలవచ్చు. సూర్యరశ్మికి గురికావడం వల్ల దద్దుర్లు వంటి సమస్యలు కూడా వస్తాయి.