avatar 3 first look: అవతార్ 3 ఫస్ట్ లుక్ విడుదల.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరూన్ సృష్టి, ‘అవతార్’ ఫ్రాంచైజీలోని మూడో భాగం “అవతార్: ఫైర్ అండ్ యాష్” నుండి తొలి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ సినిమా టైటిల్‌ను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో “వరాంగ్” అనే కొత్త పాత్రను పరిచయం చేశారు. ఈ పోస్టర్‌లో వరాంగ్ అగ్నిని ప్రతిబింబిస్తూ, మరింత గాఢమైన, భయంకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇదివరకు వచ్చిన ‘అవతార్’,’అవతార్: ది వే […]

hari hara veera mallu: పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నో ఎంట్రీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం “హరి హర వీర మల్లు”. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేడు (జూలై 21) హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌ల గురించి చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ అభిమానులకు ఒక ముఖ్యమైన నోట్‌ను విడుదల చేసింది. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో […]

KINGDOM: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’కి హిందీలో ఊరమాస్ టైటిల్ అనౌన్స్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన భారీ యాక్షన్ డ్రామా “కింగ్డమ్”. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. హిందీలో “కింగ్డమ్” చిత్రాన్ని “సామ్రాజ్య” పేరుతో జూలై 31నే విడుదల చేయనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన “కింగ్డమ్” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక వ్యక్తి […]

Hari Hara Veera Mallu Making Video: పవన్ ఎంత కష్టపడ్డాడో చూడండి.. ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “హరి హర వీరమల్లు” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరుగా సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అలాగే జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలకు […]

singer rahul sipligunj: సింగర్ సిప్లిగంజ్‌కు రూ.కోటి బహుమతి.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఇవాళ బోనాల వేడుక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. పాతబస్తీ నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు ఆదర్శమని సీఎం కొనియాడారు. సీఎం హామీ నెరవేరింది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్‌కు […]

fish venkat died: నటుడు ‘ఫిష్ వెంకట్’ కన్నుమూత.. చేపల వ్యాపారం నుంచి నటుడిగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విలక్షణ నటుడు, తనదైన శైలితో ప్రేక్షకులను అలరించిన ఫిష్‌ వెంకట్ (53) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారం చేయడంతో ఆయనకు “ఫిష్ వెంకట్”గా గుర్తింపు వచ్చింది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ చిత్రంలోని ‘తొడకొట్టు చిన్నా’ అనే డైలాగ్‌తో […]

shah rukh khan injured: బిగ్ షాక్.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ప్రమాదం..!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘కింగ్’ షూటింగ్ సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. ముంబైలోని ఒక స్టూడియోలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా ఆయనకు గాయాలైనట్లు వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది తీవ్రమైన గాయం కానప్పటికీ, కండరాల సంబంధిత గాయం (muscular injury) అని తెలుస్తోంది. అయితే వైద్యులు అతనికి కనీసం ఒక నెల రోజుల విశ్రాంతి […]

andhra king taluka: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ నుంచి లిరికల్ వీడియో.. స్పెషల్ ఏంటో తెలుసా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం “ఆంధ్ర కింగ్ తాలుకా”. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మొదటి సింగిల్ “నువ్వుంటే చాలే” లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ పాటకు స్వయంగా రామ్ పోతినేని సాహిత్యం అందించడం విశేషం. ‘‘నువ్వుంటే చాలే’’ పాటను రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. వివేక్-మెర్విన్ ద్వయం ఈ పాటకు సంగీతం అందించారు. ఈ […]

Kiara Advani And Sidharth Malhotra: ‘గర్ల్ డాడ్ క్లబ్’లో చేరిన సిద్ధార్థ్ మల్హోత్రా: ఇప్పటికే ఈ క్లబ్‌లో చేరిన ఆలియా భట్, వరుణ్ ధవన్‌

Kiara Advani,Sidharth Malhotra

Kiara Advani And Sidharth Malhotra: బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా ,కియారా అద్వానీ తమ మొదటి సంతానంగా ఆడశిశువును స్వాగతం పలికారు. దీంతో సిద్ధార్థ్ తన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’సహనటులైన ఆలియా భట్, వరుణ్ ధవన్‌లతో కలిసి ‘గర్ల్ డాడ్ క్లబ్’లో చేరారు. ఈ ముగ్గురు నటులు 2012లో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు, ఇప్పుడు వారందరూ ఆడపిల్లల తల్లిదండ్రులుగా మారారు. ఈ […]

Soubin Shahir: సౌబిన్ షాహిర్‌తో ‘కూలీ’ మోనికా గీతానికి సెప్ట్‌ వేయనున్న నాగార్జున

Monica Song

Soubin Shahir: మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన సౌబిన్ షాహిర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న రాబోయే చిత్రం ‘కూలీ’లోని ‘మోనికా’ పాటకు ఊహించని డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్‌ తో ఉర్రూతలూగించాడు. ఈ ప్రదర్శన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను ఆకట్టుకోవడమే కాక, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి మిలియన్ల కొద్దీ వీక్షణలను సాధించింది. పసుపు రంగు కుర్తాలో సౌబిన్ పవర్‌ఫుల్‌ డ్యాన్స్ స్టెప్‌లు, అతని స్టైల్‌లో హుక్ స్టెప్‌ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ ఒక్క పాట […]