international yoga day 2025: విశాఖలో ‘యోగాంధ్ర’కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

11వ ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని విశాఖపట్టణంలో గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా మరెందరో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. భారతీయ మూలాలున్న యోగా నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు.

ఈ యోగా అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప బహుమతి యోగా అని ఆయన అన్నారు. ఈ సారి తెలుగు ప్రజలకు విశాఖలోని ఆర్క్ బీచ్‌లో యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ థీమ్‌తో నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీని కొనియాడారు. ఆయన కృషి వల్లే నేడు ప్రపంచమంతా యోగా ఫేమస్ అయింది అని అన్నారు.

అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి సహకారంతో ప్రధాని మోదీ.. యోగాను ఇంటర్నేషనల్ యోగా డే అయ్యేలా చేశారని ప్రశంసించారు. దీంతో ఇవాళ 175 దేశాల్లో 12 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారంటే అది మోదీ చేసిన కృషి ఫలితమేని అన్నారు. కుల, మత, భాషా, ప్రాంతాలతో ఎలాంటి సంబంధం లేకుండా సుమారు 10 కోట్ల మందికి పైగా యోగా చేస్తున్నారని కొనియాడారు.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ వేదికగా 3 లక్షలకు పైగా ప్రజలు యోగాసనాలు వేశారని తెలిపారు. విశాఖ సాగర తీరాన ఈ గొప్ప కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా 25 వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్, ఒకేసారి 108 నిమిషాల పాటు, 108 సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని తెలిపారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం