Skin Care Tips: పసుపుతో అందమైన సౌందర్యం మీ సొంతం.. మొటిమలు, మచ్చలకు చెక్ పెట్టేయండిలా?

ప్రస్తుత కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రోడ్లపై ప్రయాణిస్తున్న చాలామంది ముఖం రకరకాల మార్పులకు గురవుతుంది. చాలా అందంగా, నిగారింపు సౌందర్యంతో ఉన్న పురుషులు లేదా స్త్రీల ముఖ కాంతి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో చాలామంది కెమికల్ ప్రొడక్ట్స్ వాడి తమ అందాన్ని మరింత పోగొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న పసుపు తోనే మీ అందాన్ని మళ్లీ తిరిగి పొందొచ్చు. ఖరీదైన కాస్మోటిక్స్ కొని డబ్బులు […]

Hair Pack: వంటగది సామాన్లతో హెయిర్ ప్యాక్.. జుట్టు సమస్యలకు చెక్ పెట్టేయండిలా?

ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం, జుట్టు చివర్లు చిట్లపోయి పెరుగుదల ఆగిపోవడం, జుట్టు మెరుగుదల కనిపించకపోవడం వంటివి ఎన్నో సమస్యలు చాలామందిలో తలెత్తుతున్నాయి. దీంతో కొందరు రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడి మరింత సమస్యల్లో పడుతున్నారు. కెమికల్ ప్రొడక్ట్స్ కారణంగా జుట్టు సమస్య ఆగకపోగా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందువల్ల మీరు ఇలా అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. […]

చియా విత్తనాలు vs సబ్జా విత్తనాలు.. ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. అదే సమయంలో తమను తాము ఆరోగ్యంగా కాపాడుకోవడానికి తమ ఆహారంలో అనేక రకాల సూపర్‌ఫుడ్‌లను చేర్చుకుంటున్నారు. అందులో చియా విత్తనాలు ఒకటి కాగా, మరొకటి సబ్జా విత్తనాలు. ఈ రెండు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను అందిస్తాయి. ఎన్నో సమస్యలను వీటిద్వారా నియంత్రించవచ్చు. సబ్జా విత్తనాలను తులసి విత్తనాలు అని కూడా పిలుస్తారు. ఈ రెండు విత్తనాలు మంచి బెనిఫిట్స్ అందిస్తాయి. వీటిలో వేర్వేరు పోషకాలు […]

coconut water health problems: కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?.. ఈ సమస్యలు ఉన్నవారు బీ కేర్‌ఫుల్!

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఈ కొబ్బరి నీళ్లు తాగితే డిహైడ్రేషన్ బారి నుండి బయట పడతారు. ఇందులో విటమిన్ సి, ఐరన్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఈ వంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి కావలసిన ప్రయోజనాలను అందిస్తాయి. రోగనిరోదక శక్తిని పెంచుతుంది. అయితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కొందరు మాత్రం కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. కొన్ని సమస్యలు ఉన్న వ్యక్తులకు ఈ కొబ్బరినీళ్లు […]

Aloevera Benefits: నమ్మరేంట్రా బాబు.. ఒక్కసారి వీటిని ట్రై చేశారంటే.. చుండ్రుకు చెక్- జుట్టే జుట్టు!

ప్రస్తుతం అందర్నీ ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం, చుండ్రు, వెంట్రుకలు పలుచబడడం. ఈ సమస్యలు ప్రస్తుతం చాలా మంది ఫేస్ చేస్తున్నాారు. పురుషులు, స్త్రీలు ఎక్కువగా ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వీటిని కంట్రోల్ చేసేందుకు ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. మరెన్నో ఎలక్ట్రానిక్స్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సమస్య తగ్గకపోగా మరింత ఎక్కువవుతుంది. అయితే వీటన్నింటినీ పరిష్కరించేందుకు ఏదన్నా ఉంది అంటే అది ఒక కలబంద అని వైద్యులు చెబుతున్నారు. ఈ […]

simple facial tips: పార్లర్‌కి వెళ్లకుండా ఇంట్లోనే మిలమిల మెరిసే అందం.. ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే చాలు!

చాలామంది తమ ముఖ సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకోవడానికి ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొందరు ఆ ఖర్చుకు భయపడి అటువైపు చూడడమే లేదు. మీరు కూడా అలాంటి వారే అయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి మీ ఫేస్ ను మరింత మృదువుగా, అందంగా చేసుకోవచ్చు. ఇంటి వద్దనే స్టీమ్ ఫేషియల్ ట్రై చేసి […]

Cucumber cause health problems: ఈ పదార్థాలతో కీరదోస తింటున్నారా?.. ఉక్కిరిబిక్కిరి అయిపోతారు జాగ్రత్త!

వేసవికాలంలో చాలామంది కీరదోసను తినేందుకు ఇష్టపడతారు. దానిలో ఉండే పోషకాలు వేడిని కంట్రోల్ చేసి శరీరాన్ని చల్ల బరుస్తాయని నమ్ముతారు. ఇవి చల్లగా, రుచిగా ఉంటాయి. అందువల్లనే కీరదోసను చాలామంది తమ ఆహారంలో వివిధ రకాలుగా చేర్చుకుంటారు. సలాడ్లు, శాండ్విచ్, పిజ్జా, రైతా లలో వీటిని ఉపయోగిస్తారు. నిజానికి చెప్పాలంటే కీరదోస శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు దీనిని ఇతర పదార్థాలతో తీసుకునేటప్పుడు లాభాలకు బదులు నష్టాలను కూడా కలిగిస్తుంది. వేసవికాలంలో దోసకాయను […]

lips Causes: లిప్స్ పగిలిపోవడం.. నల్లగా మారడానికి కారణాలు ఇవే.. ఈ టిప్స్‌తో కంట్రోల్ చేసేయండి!

సాధారణంగా శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలంలో ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తాయి. అందులో పెదవులు పగిలిపోవడం ఒకటి. ఈ సీజన్లో కూడా చాలామందిలో పెదవులు పగులుతాయి. కొందరికి రక్తం కూడా వస్తుంది. అలాంటి సమయంలో చాలామంది కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలా చేయడం చాలా తప్పని వైద్యులు అంటున్నారు. శరీరంలో కొన్ని పోషకాల లోపంతో పెదాలు పగులుతాయని చెబుతున్నారు. వాటిని భర్తీ చేయడం ద్వారా పెదాలను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావచ్చు అంటున్నారు. చాలామందికి పెదవుల అంచుల్లో పగుళ్లు […]

Summer Health Tips: సమ్మర్‌ వేడి గాలులకు కళ్లు మటాష్.. ఇలా రక్షించుకోండి!

దేశంలోని వివిధ ప్రాంతాలలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రాబోయే రెండు వారాల పాటు వేడిగాలులు వీస్తాయని అంచనా వేసింది. శుక్రవారం దేశ రాజధానిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, తేలికపాటి వర్షాలు కురిశాయి. అలాగే ఏప్రిల్ 15 నుండి పంజాబ్, ఢిల్లీ, హర్యానాలో నెల మొత్తం అనేక ఇతర ఉత్తర భారత రాష్ట్రాలలో వేడిగాలుల హెచ్చరికలను IMD జారీ చేసింది. తీవ్రమైన వేడి పరిస్థితులు […]

Cloves Health Benefits: రెండు లవంగాలు చాలు.. బోలెడు ఆరోగ్య బెనిఫిట్స్.. అస్సలు వదలొద్దు!

ప్రతి ఒక్కరి ఇళ్లల్లోని వంటగదిలో దొరికే అద్భుతమైన ఆయుర్వేదం లవంగాలు. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రుచి, సువాసన కోసం వీటిని కూర్లలో, బిర్యానిలో వాడుతారు. వాటితో పాటు లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో.. అలాగే మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. వేసవిలో వీటి ప్రయోజనాలు బాగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు […]