ఆలయాలను ప్రభుత్వాల పరిధి నుంచి తప్పించాల్సింది కేంద్రమే – రాష్ట్రాల్లో ఈ శంఖారావాలెందుకు?

Temples

BJP started communal politics: హైందవశంఖారావం పేరుతో విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ సభను నిర్వహించింది.  అది హైంద విలువలను బోధించడానికి పెట్టలేదు.  ఆ పేరుతో రాజకీయం చేసి ఆలయాలపై పెత్తనం పొందాలనే దురాశతో చేశారో కానీ మాట్లాడిన వాళ్లందరిదీ అదే తీరు. కాషాయం ధరించిన తర్వాత అన్నీ వదిలేస్తారు.  కానీ అక్కడ కాషాయం ధరించిన ప్రతి ఒక్కరూ స్వార్థపూరిత ప్రసంగాలే చేశారు.     హైందవ శంఖారావ సభను వీహెచ్‌పీ నిర్వహించినా ఏర్పాట్లన్నీ బీజేపీ నేతలే […]

స్కామ్ చేశానని నిరూపించేసుకుంటున్న కేటీఆర్ – ఇలాంటి సెల్ఫ్ గోల్స్ ఇంకెవరూ చేసుకోలేరు !

కేటీఆర్ సెల్ఫ్ గోల్స్

KTR Self Goals:  ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు. న్యాయపోరాటం పేరుతో తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని ప్రజలు అనుకునేలా చేసుకుంటున్నారు.  అంతా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని బెదిరిస్తున్నారు. కానీ అలాంటి బెదిరింపులకు రాజకీయాలు లొంగవన్న సంగతిని మాత్రం మరచిపోతున్నారు.  తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మాత్రమే  హైకోర్టు కొట్టి వేసిందని ఇంత మాత్రం దానికే .. తాను అవినీతి చేసినట్లుగా నిర్దారణ అయిందని తప్పుడు […]

కేబినెట్ నుంచి సీఎస్ వరకూ అంతా లోకేష్ చాయిసే – పార్టీ, ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారా ?

బినెట్ నుంచి సీఎస్ వరకూ అంతా లోకేష్ చాయిసే

TDP LOKESH:   ప్రభుత్వం, టీడీపీలో నిర్ణయాలన్నీ నారా లోకేష్ చాయిస్ మేరకే జరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ అనే ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసుకోవాలనుకున్నారు. కానీ టీడీపీ సోషల్ మీడియా ఆయన జగన్ హయాంలో చేసిన నిర్వాకాలంటూ కొన్ని పోస్టులు వెలుగులోకి వచ్చాయి. తర్వాత  విజయానంద్‌కు సీఎస్ గా నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే…  విజయానంద్ కు మద్దతుగా లోకేష్ సిఫారసు చేశారు . దాంతో ఆయనకే […]

Revanth Reddy Change: రేవంత్ మారడం వల్లే సమస్యలు – మళ్లీ ఏం మారుతారు ?

రేవంత్ మారడం వల్లే సమస్యలు - మళ్లీ ఏం మారుతారు ?

Telangana Congress: నూతన సంవత్సరం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నేను మారాను, మీరు కూడా మారండి అని ఎమ్మెల్యేలకు సందేశం పంపించారు.  రేవంత్ కొత్తగా ఏ విషయాల్లో మారారన్నది మాత్రం పార్టీ శ్రేణులకు తెలియదు . కానీ ఆయన మారడం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని క్యాడర్ అనుకుంటున్నారు. పార్టీలో చేరిన వారితో కలిసి పని చేయాలని రేవంత్ చెబుతున్నారు. అసలు ఎందుకు చేర్చుకోవాలన్నది ఎక్కువ మంది నుంచి వస్తున్న ప్రశ్న.  ఎమ్మెల్యేలను చేర్చుకునే […]

నాగబాబును మంత్రిని చేస్తే జనసేనకు గండమే – ప్రజల్ని తక్కువ అంచనా వేస్తారా ?

నాగబాబును మంత్రిని చేస్తే జనసేనకు గండమే - ప్రజల్ని తక్కువ అంచనా వేస్తారా ?

Nagababu:   నాగబాబును మంత్రిని చేస్తే ప్రజల్లో జనసేన చులకన అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో పండిపోయిన ఎవరైనా ఒకే కులానికి, ఒకే కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రజలు సహించరు. జనసేన విషయంలో పవన్ కల్యాణ్ అదే తప్పు చేస్తున్నారు. నాగబాబును కులం ప్రకారం కాదని..కుటుంబం పరంగా చూడలేదని ఆయన పార్టీకి చేసిన సేవల ప్రకారమే మంత్రిని చేస్తున్నామని అంటున్నారు. కానీ ప్రజలు ఈ మాటల్ని .. వాదనల్ని ఏ మాత్రం సహించే అవకాశం […]

Nitish Kumar Reddy: ఫాదర్ ఆఫ్ ద ఇయర్ ముత్యాలరెడ్డి – నితీష్ కోసం ఆయన చేసిన త్యాగాలే ఆ కన్నీళ్లు !

ఫాదర్ ఆఫ్ ఇయర్ ముత్యాలరెడ్డి - నితీష్ కోసం ఆయన చేసిన త్యాగాలే ఆ కన్నీళ్లు !

Mutyala Reddy:   బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లను బాక్సింగ్ ఆడేసుకున్న  నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన తర్వాత స్టాండ్స్ లో ఉన్న ఓ వ్యక్తి భావోద్వేగం హైలెట్ అయింది. తర్వాత ఆయనెవరో తెలిసి ఆ మాత్రం ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఆ భావోద్వేగం.. వెనుక ఉన్న త్యాగం మాత్రం చాలా మమందికి తెలియదు.  తర్వాత హోటల్ రూంకు వచ్చినప్పుడు కుటుంబం అంతా ఆనంద భాష్పాలతో ఎమోషనల్ అయిన దృశ్యాలు చూసి అందరి కళ్లు […]

Ambati Rambabu: రేవంత్ రెడ్డి ఓ చూపు చూస్తే అంబటి రాంబాబు పరిస్థితేంటి? ఎందుకలా రెచ్చగొడుతున్నాడు ?

రేవంత్ ను టార్గెట్ చేస్తున్న అంబటి

Ambati On Revanth:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అంబటి రాంబాబు పంచలు వేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా , సందర్భం ఉన్నా లేకపోయినా.. అక్కడ స్పేస్ లేకపోయినా సృష్టించుకుని మరీ దాడికి దిగుతున్నారు. అంబటిపై స్పందించేంత తీరిక కాంగ్రెస్ నేతలకు లేదు కానీ.. ఆయన వైపు రేవంత్ రెడ్డి టీమ్ ఓ చూపు చూస్తే రాంబాబు పరిస్థితి ఏమవుతుందో చెప్పాల్సిన పని లేదన్న సెటైర్లు మాత్రం.. ఆయన పెట్టే పోస్టుల కిందనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  నితీష్ […]

Social Media: భలేవారండి – సోషల్ మీడియాను మంచికే వాడాలా ?

భలేవారండి - సోషల్ మీడియాను మంచికే వాడాలా ?

Andhra Pradesh:  సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు ఈ ప్రపంచంలో జరిగాయో .. జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు.  ఫేస్ బుక్ వల్లనే ప్రపంచంలో ఎక్కువగా విడాకులు అవుతున్నాయి. జంటలు విడిపోతున్నాయి. అలాంటి స్థితిలో వచ్చి పడిన వాట్సాప్ , ట్విట్టర్, ఇన్ స్టా వంటివి వచ్చి పడ్డాయి. అయితే కల్లోలం అందరికీ అలవాటైపోయింది. వీటిని రాజకీయ నేతలు వాడుకోవడం ప్రారంభించిన తర్వాత డిజాస్టర్ గామారిపోయింది. ఇప్పుడు కొంత మంది నీతులు చెబుతూ బయలుదేరారు. మంచికే వాడదామంటూ […]

Revanth Reddy : చంద్రబాబు శిష్యుడు – జగన్ ఫ్యాన్ – రేవంత్ దారి తప్పారా ?

చంద్రబాబు శిష్యుడు - జగన్ ఫ్యాన్ - రేవంత్ దారి తప్పారా ?

Ravanth And Jagan:  రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు. ఆయన విధానాలు నచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలో చేరమన్నప్పటికీ చేరకుండా టీడీపీలో చేరాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చంద్రబాబును  స్పూర్తిగా తీసుకుని పరిపాలిస్తున్నారా?. ఏడాది పాలన చూసిన ఎవరూ ఆ మాట అనడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా ఆయన పాలనను జగన్ పాలనతో పోలుస్తున్నారు. సినీ ఇండస్ట్రీని అచ్చం జగన్ లాగానే టార్గెట్ చేశారని దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నారు.  జగన్ లాగానే […]

అమరావతి అభివృద్ధి – తెలంగాణలో ఆందోళనలు..చాట్ జీపీటీ ప్రిడిక్షన్స్ @ 2025

image credit: pixabay

కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాం. 2024లో హైలెట్స్ ఇవే అంటూ మీడియాలో వరుస కథనాలొస్తున్నాయ్. జరిగిందేదో జరిగిపోయింది మరి ఫ్యూచరేంటి? అది కదా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం కావాలన్నా క్షణాల్లో సమాచారం ఇచ్చేస్తోన్న AI టూల్స్, చాట్ బోట్లను అడిగితే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాయ్. నూతన సంవత్సరం 2025లో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయ్? ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలు తీరుతాయా? సినిమా ఇండస్ట్రీ […]