కడపను టీడీపీ చేతిలో పెడుతున్న అవినాష్ రెడ్డి -జగన్‌కు వెన్నుపోటు!

కడపను టీడీపీ చేతిలో పెడుతున్న అవినాష్ రెడ్డి -జగన్‌కు వెన్నుపోటు!

Avinash Reddy made an internal deal with TDP:  కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఆయన పేరు పెట్టారు కానీ..   కడప అంటే వైఎస్ఆర్ అనేలా ఆయన రాజకీయం చేశారు.  వైఎస్ఆర్ జిల్లా అని పిలుచుకునేలా చేశారు. ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ జిల్లా కాస్తా కడప జిల్లాగా మారుతోంది.  రాజకీయంగా కూడా.  తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో  సఫలమవుతోంది. దీనికి వైసీపీ […]

భారతరత్న ఎన్టీఆర్ – అవార్డు ప్రకటనకు అడ్డం ఎవరు ?

NTR

Bharat Ratna:  తెలుగువారి నిండు గర్వం నందమూరి తారక రామారావు. ఆయన ఎప్పుడో భారతరత్నం కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఇప్పించవచ్చు కానీ ఇప్పించలేదు. ఎందుకో వారికో తెలుసు. ఇప్పుడు మరోసారి ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. నిజానికి పొత్తులకు ముందు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటి్స్తారన్న ప్రచారం కానీ అనువైన సమయం కాదని ఆగిపోయారేమో కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ వర్థం […]

టీడీపీలో లీడర్‌ని డామినేట్ చేస్తున్న క్యాడర్ – అదే బలం ..బలహీనత కూడా!

టీడీపీలో లీడర్‌ని డామినేట్ చేస్తున్న క్యాడర్ - అదే బలం ..బలహీనత కూడా!

TDP:  టీడీపీని క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెబుతూ ఉంటారు. నేతలు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కానీ పార్టీని అంటి పెట్టుకుని ఉండేది క్యాడరే. ఇప్పుడు ఆ క్యాడర్ సోషల్ మీడియానూ ఊపేస్తున్నారు. వారిలో చాలా మంది పార్టీ నేతలతో కానీ.. పార్టీతో కానీ డైరక్ట్ గా సంబంధాలు ఉండవు. అభిమానంతోనే పని చేస్తూ ఉంటారు.  వారికి పార్టీనే ముఖ్యం. అందుకే పార్టీ నేతలు .. పార్టీని అవమానించినట్లు..పార్టీ అధినేతను కించపరిచినట్లుగా అనిపిస్తే మాత్రం ఊరుకోవడంలేదు. […]

శ్రీతేజ్‌ ఆస్పత్రి ఖర్చులు కూడా ప్రభుత్వానివే – తప్పు పుష్పా.. తప్పు !

Allu Arjun

Sandya Stampade: సినిమా వాళ్ల గురించి బయట రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇంత చీప్ గా ఉంటారా అని జనం అనుకుంటూ ఉంటారు. అంత కంటే చీప్ గా ఉంటారని వారి గురించి కొన్ని నిజాలు బయటపడినప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అలాంటిదే ఈ ఘటన కూడా.  సంధ్యా ధియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కోమాలో ఉన్న  అల్లు అర్జున్ చిన్నారి అభిమాని శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు అటు అర్జున్ కానీ.. ఇటు సినిమా యూనిట్ కానీ.. […]

ఆంధ్రా బీజేపీ ఇక ఎదగదా ?

ఆంధ్రా బీజేపీకి ఇక ఎదగదా ?

Andhra BJP: బీజేపీ దేశంలో అన్ని చోట్లా జెండా పాతుతోంది. చివరికి తెలంగాణలో కూడా బలమైన ఫోర్స్ గా ముందుకు వచ్చింది. కానీ ఒకే ఒక్క ఏపీలో మాత్రం ఎదగడం లేదు.  అలా చెప్పడం కన్నా ఎదిగే ప్రయత్నం చేయడం లేదు.. ఆ చాన్స్ ఆ పెద్దలు ఇవ్వడం లేదు అనుకోవచ్చు. ఎందుకంటే జాతీయ రాజకీయ అవసరాల కోసం పార్టీని ఎప్పటికప్పుడు పణంగా పెడుతున్నారు కానీ బలోపేతం చేసే వారికి చాన్సులు ఇవ్వడంలేదు. దీంతో నేతలు కూడా […]

జైలుకెళదాం.. సీఎం అవుదాం.. ఛలో.. ఛలో !

జైలుకెళదాం.. సీఎం అవుదాం.. ఛలో.. ఛలో !

Jail CMs:  జైలుకెళ్లినోళ్లు అందరూ సీఎంలు అవుతున్నారని అల్లు అర్జున్ కూడా సీఎం అవుతారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారాలు ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ చేసుకునే స్వాములు, కాకా పట్టే జాతకాలరాయుళ్లు ఈ థియరీతో ముందుకు వచ్చేశారు. అసలు అల్లుఅర్జున్ .. సీఎం అనే పదవికి ఎక్కడైనా సంబంధం ఉందా అన్న విషయాలు మాత్రం ఆలోచన చేయడం లేదు. అసలు జైళ్లలో ఎంత మంది ఉంటున్నారు ? ఎంత మంది విడుదల అవుతున్నారో కనీసం తెలిసే […]

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది – ఎగ్జాంపుల్ పేర్ని నాని !

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది - ఎగ్జాంపుల్ పేర్ని నాని !

Perni Nani:   పేర్ని నాని ప్రెస్ మీట్ పెడితే పవన్ కల్యాణ్‌కు దబిడి..దబిడే అని వైసీపీ నేతలు, సోషల్ మీడియా చాలా కాలం ట్రోల్ చేశారు. ఇప్పుడు తాను బయట కనిపిస్తే దబిడిదబిడే అనే భయంతో కుటుంబంతో సహా ఆయన కనిపించకుండా పోయారు. అతి కష్టం మీద రూ. రెండు కోట్లు ప్రభుత్వానికి కట్టి బిక్కు బిక్కుమంటూ తాను ఒక్కడే బయటకు వచ్చాడు. కానీ కుటుంబం మొత్తంపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయనకీ ఈ […]

వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటీ? జమిలీ ఎన్నికలతో దేశానికి ఏం ప్రయోజనం? ఇప్పటి వరకు ఏ దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది?

What is One nation One Election

ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లు అంశంలో వెనక్కి తగ్గేదేలే అని కేంద్రం సంకేతాలు పంపించింది. లోకసభలో ఈబిల్లు ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. అందుకే బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లును మంగళవారం(17డిసెంబర్‌ 2024) మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ […]

Tabla Legend Zakir Hussain: నాన్నే నా తొలిగురువు – తబలా ఉస్తాద్ జాకిర్ హుసేన్ గురించి ఈ విషయాలు తెలుసా!

image credit: X

Zakir Hussain: అమెరికాలో నివసిస్తున్న ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు జాకిర్ హుసేన్ కన్నుమూశారు. భారత ప్రభుత్వం జాకిర్ హుసేన్‌ను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలతో సత్కరించింది. ఏడేళ్ల వయసునుంచే తబలా వాయించడం ప్రారంభించిన హుసేన్, హిందూస్థానీ సంగీతంలో పండితులైన ఎంతో మంది సంగీత కళాకారులతో కలిసి పని చేశారు. గ్రామీ అవార్డు గ్రహీత అయన జాకిర్ హుస్సనే.. ఏడుసార్లు ఆయన ఈ అవార్డులకు నామినేట్ అయి.. నాలుగుసార్లు అవార్డు గెలుచుకున్నారు. ‘గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్’కు గానూ […]

Atul Subhash suicide case Story: బెంగళూరు టెకీ కేసులో భార్య నికిత, ఆమె తల్లి, సోదరుడు అరెస్ట్..అతుల్ సుభాష్ డిమాండ్స్ ఇవే!

Image Credit: X

Atul Subhash suicide case Story:  భార్య నుంచి వేధింపులు భరించలేక ప్రాణంతీసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కేసులో ఆయన భార్య సహా అత్తింటివారిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న ఆయన భార్య నికితను, ఆమె తల్లిని, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. భార్య నుంచి వేధింపులు భరించలేక ప్రాణం తీసుకున్న సుభాష్..24 పేజీల సుదీర్ఘ లేఖరాయడంతో పాటూ గంటా 20 నిముషాల వీడియో తన […]