సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా ‘కూలి’. స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో సర్ ప్రైజ్ అందించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఇవాళ రిలీజ్ అయింది. సాయంత్రం 6 గంటలకు ‘చికిటు చికిటు’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో సూపర్ స్టార్ రజినీకాంత్ వేసిన స్టెప్స్ హైలైట్‌గా ఉన్నాయి.
అనిరుధ్ మ్యూజిక్ అందించగా.. టి. రాజేందర్ బీట్ బాక్సింగ్, అరివు రాసిన లిరిక్స్‌తో ఈ సాంగ్ ఓ ఊపుఊపేస్తుంది. ఈ ఫస్ట్ సింగిల్‌తో మూవీపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే జైలర్ మూవీతో సత్తా చాటిన రజినీ కాంత్.. ఆ తర్వాత వెట్టయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు ఆయన ‘కూలి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. ఇప్పటికే రజినీ కాంత్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసేశాడు.
మిగిలి ఉన్న షూటింగ్‌ను లోకేష్ కనగరాజ్ త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సైతం కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
కాగా ఆగస్టు 14న ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’ మూవీ కూడా విడుదల కానుంది. దీంతో ఈ రెండు చిత్రాల రిలీజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద భారీ వార్ జరగబోతున్నట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో.





