తెలంగాణలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. సోమవారం ఉదయం ఈ దారుణమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎంతో మంది కార్మికులు మృతి చెందారు. స్పాట్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి పైగా తీవ్రగాయాలతో బయటపడ్డారు.
మంటలను అదుపుచేసేందుకు 11 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాజాగా ఈ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు మృతుల సంఖ్య 34కి చేరింది. ఈ విషయాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
శిథిలాలను తొలగిస్తున్న సమయంలో మరిన్ని డెడ్ బాడీలు బయటపడ్డాయన్నారు. మొత్తం 31 డెడ్ బాడీలను బయటకు తీశామని.. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుని మరో ముగ్గురు ప్రాణాలు విడిచారని తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే ఈ బ్లాస్టింగ్‌కు గల కారణం ఇంకా తెలియలేదు. ఈ పేలుడుతో పారిశ్రామిక షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
ముఖ్యమంత్రి విచారం
ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు తెలిపార.





