కాక్రోచ్ జనతా పార్టీ vs కేంద్ర ప్రభుత్వం; నెగ్గింది ఎవరు?

cjp

భారత ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన సర్ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ, ఏకపక్షంగా వ్యవహరించే జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ గత వారం పది రోజుల నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. శుక్రవారం వరకు ఇండీ కూటమి నేతలు రోడ్లపై ధర్నాలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా విపక్షాలు ఢిల్లీ వీధుల్లో పోరాటాలు చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నేతల వంతు వచ్చింది. ముందస్తుగా అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నట్టు ఇచ్చిన పిలుపుతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జూలైలో తలెత్తిన పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. సీజేపీ నేతలు, కార్యకర్తలు జంతర్ మంతర్ వద్దకు చేరుకోకుండా కట్టడి చేసింది. అయితే ఈ క్రమంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వీధి పోరాటంలో ఒక విధంగా సీజేపీ పైచేయి సాధించిందని చెప్పవచ్చు.

జూలైలో చుక్కలు చూపించిన బొద్దింకలు

నీట్ పేపర్ లీకేజీ సహా పలు పరీక్ష పత్రాల్లో జరిగిన అక్రమాలపై జూలైలో పోరాటం చేసిన సీజేపీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. ఈ నిరసనలకు దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన విద్యార్థి నేతలు పార్లమెంట్ ముట్టడికి బయల్దేరడం ఉద్రిక్తతకు దారి తీసింది. వాళ్లని కట్టడి చేసే క్రమంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.

కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కేంద్రం

అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు కేంద్రం సామబేధ దండోపాయాలు ఉపయోగించింది. నిరసనకారులు దిల్లీలో అడుగు పెట్టకుండా అష్టదిగ్బంధనం చేసింది. పారామిలటరీ బలగాలు, దిల్లీ పోలీసులను వేల సంఖ్యలో మోహరించారు. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర్‍ప్రదేశ్, ఇలా దిల్లీ వచ్చేందుకు అవకాశం ఉన్న అని ప్రాంతాలను రౌండప్ చేశారు. ట్రైన్స్‌ను రద్దు చేశారు, కొన్నింటిని ఇతర్రాష్ట్రాల్లనో నిలిపేశారు. బస్‌లను కట్టడి చేశారు. దిల్లీ మెట్రోపై ఆంక్షలు విధించారు.

సీజేపీ శ్రేణులను కట్టడి చేసిన బలగాలు

జంతర్ మంతర్ ధర్నాకు వస్తున్న వారిని పసిగట్టి రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్, ఎయిర్ పోర్టుల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సహా వారి టీం మొత్తాన్ని కూడా విమానం దిగకుండానే రిటర్న్ టికెట్ బుక్ చేసి పంపేశారు. ధ్రువ్ రాఠీ లాంటి వారిని ఇంటి నుంచి రాకుండా కట్టడి చేశారు. పలు పార్టీల నాయకులను కూడా గృహనిర్బంధం చేశారు.

నిఘా నీడలో సెంట్రల్ దిల్లీ

సెంట్రల్‌ దిల్లీలో ఎక్కడ చూసిన బారికేడ్లు, భద్రతా బలగాలే కనిపించాయి. అటుగా వచ్చిన ప్రతి ఒక్కర్ని ప్రశ్నించి అనుమానం వచ్చిన వెంటనే అక్కడి నుంచే తీసుకెళ్లిపోయారు. ఎవరో ఒకరిద్దరు మినహా జంతర్ మంతర్ వద్దకు ఎవర్నీ చేరకోనివ్వకుండా పోలీసులు విజయం సాధించారు.

కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు

పోలీస్ నిర్బంధంపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎమర్జెన్సీని తలపిస్తోందని కేజ్రీవాల్ లాంటి వాళ్లు మండిపడ్డారు. నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కూడా ప్రభుత్వం కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ప్రజలు గమిస్తున్నారని బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ప్రతిపక్షాలపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

ఈ ఆందోళనలపై బీజేపీ మండిపడింది. దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతూ…. ప్రతి పక్షాల కుట్రలకు ఊతమివ్వకూడదనే నిరసనకారులను కట్టడి చేశారని అన్నారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

నైతిక విజయం సాధించిన సీజేపీ

జంతర్ మంతర్ వద్దకు సీజేపీ శ్రేణులను రాకుండా కేంద్రం విజయవంతమైంది కానీ ప్రజల్లో ఒక వ్యతిరేక భావన ముటకట్టుకుంది. వివిధ ప్రాంతాల్లో నిర్బంధాలు చూసిన వారంతా ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. తీసుకున్న చర్యలపై చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలో మాత్రం సీజేపీ పైచేయి సాధించింది. కేంద్ర ప్రభుత్వం నిరకుంశ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం